Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 6th February Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 6th February Information

చరిత్రలో ఈరోజు
1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 వ సం.లో జన్మించారు.
రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త విలియం పి. మర్ఫీ 1892 వ సం.లో జన్మించారు.
ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ 1804 వ సం.లో మరణించారు.
ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు సూరి భగవంతం 1889 వ సం.లో మరణించారు.
భారత జాతీయ నాయకుడు మోతిలాల్ నెహ్రూ 1931 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సముద్రం నీరు ఉప్పగా ఎందుకుంటుంది ?
కాలువలు, సెలయేళ్లు నదిలో కలిస్తే, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. నదీ జలాలలో కొండరాళ్లు, డెబ్రిస్ (గుర్రపుడెక్కాకు, తుక్కు తదితర వ్యర్థ పదార్థాలు) కలిసి వుంటాయి. ఈ కొండరాళ్లలో ఖనిజ లవణాలు ముఖ్యంగా సోడియం క్లోరైడ్ అనే లవణం ఎక్కువగా వుంటుంది. నదీజలాలు సముద్రంలో కలిసినప్పుడు వాటిలోని ఖనిజ లవణాల ప్రభావం వల్ల సముద్రంలోని నీరు ఉప్పగా మారిపోతుంది. అయితే సముద్ర జలాలు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరై అవి మేఘాలుగా మారినపుడు వాటికి అంతకుముందున్న ఉప్పదనం పోయి వర్షం కురిసినప్పుడు మామూలుగానే వుంటాయి.
మంచి మాట /సుభాషితం:
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.
భావం- ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.
వార్తలలోని ముఖ్యాంశాలు
శారదా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో సీబీఐకి సహకరించాలని కోల్‌కతా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో సంస్థ ఎదుట విచారణకు హాజరు కావాలని సూచించింది. దీనితో మమతా బెనర్జీ నిరసన విరమించుకున్నది.  
అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం(డెమార్ష్‌) జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. 'వారికి ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో బోధనా వ్యవస్థ లేదన్న విషయం తెలుసని. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు అని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు.
 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏరియానా స్పేస్‌ రాకెట్‌ ద్వారా ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి భారత కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌ 31 విజయవంతంగా నింగిలోకి పంపింది. జీశాట్‌ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్‌ శాట్‌ -4 ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
 ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,26,177 కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2018-19 బడ్జెట్‌ అంచనాల కంటే ఇది రూ.35,113 కోట్లు అధికం. ప్రాధాన్య రంగాలైన పంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,208.82 కోట్లు (50.10% అధికం) ఇవ్వగా... వ్యవసాయంఅనుబంధ రంగాలకూ కేటాయింపులు ఎక్కువ చేసింది.
దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని, వ్యవసాయంలో రాష్ట్ర వృద్ధి 11శాతం ఉండగా.. దేశంలో 2.4శాతం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.త్వరలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని కూడా తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు.
 రాష్ట్ర నిధులుఎంపీఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులుఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకొని గ్రామాల సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
 న్యూజిలాండ్‌తో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ నేడు మొదలుకానున్నాయి. ఇదిలా ఉండగా మహిళల టీమ్‌ఇండియా వన్డే సారథిసీనియర్‌ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అనంతరం టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుంది. 

Click Here.....To Download The Above Information in Pdf
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.

  • SCHOOL ASSEMBLY:6th February(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం)
  • SCHOOL ASSEMBLY:6th February(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 6th February Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2019 school assembly,February 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 6th February 2019 assembly, 6th February 2019 assembly,news of the day history,news of the day highlights,6th dec 2019 assembly, dec 6th assembly, dec 6th historical events, 6th February 2019 assembly, February 6th assembly, February 6th historical events,school related today assembly,school related today news, school related February 6th information, school related February month information, School Assembly 6th Feb Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Feb month school assembly day wise,Feb 2019 school assembly,Feb 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 6th Feb 2019 assembly, 6th Feb 2019 assembly,news of the day history,news of the day highlights,6th dec 2019 assembly, dec 6th assembly, dec 6th historical events, 6th Feb 2019 assembly, Feb 6th assembly, Feb 6th historical events,school related today assembly,school related today news, school related Feb 6th information, school related Feb month information
    Previous
    Next Post »
    0 Komentar