Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

School Assembly 2nd March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 2nd March Information


చరిత్రలో ఈరోజు
1807: అమెరికా కాంగ్రెస్ బానిసలను దిగుమతి చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించింది.
1836: టెక్సాస్ విప్లవం ద్వారా టెక్సాస్ రిపబ్లిక్ కు మెక్సికో దేశం నుండి స్వతంత్రం లభించింది.
1943: రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
తొలి తెలుగు నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు 1938 వ సం.లో మరణించారు.
భారత కోకిల సరోజిని నాయుడు 1949 వ సం.లో మరణించారు.
భారతీయ కళల పరిరక్షణకు కృషి చేసిన కళాపిపాసి టి.వి.కె.శాస్త్రి 2014 వ సం.లో మరణించారు.
ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు పరుచూరి హనుమంతరావు 2015 వ సం.లో మరణించారు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌ తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది.


నేటి అంశము:
సబ్జాగింజలవల్ల ఉపయోగాలు
సబ్జాగింజల్లో మంచి ప్రొటీన్ ఒమేగా కొవ్వు ఆమ్లాలతో పాటు ఐరన్, క్యాల్షియం ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సైడ్లు, ఫైబర్ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. నీళ్లల్లో వీటిని నానబెట్టుకొని, జ్యూస్ లో త్రాగవచ్చు. ఇంకా మజ్జిగ, నిమ్మరసం, పళ్ల రసాలతో కలిపి తీసుకోవచ్చు. ఇవి కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
మంచి మాట /సుభాషితం:
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
భావం- జరిగిన దాని గురించి భాదపడకు, చెడ్డవారిని ఎలాంటి పరిస్థితులలో పొగడకు. సాధ్యం కాని పనులు వదిలిపెట్టు. దైవం ఎలా నడిపిస్తే అంతా అలాగే జరుగుతుంది.


వార్తలలోని ముఖ్యాంశాలు
భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది.
అభినందన్‌ స్వదేశానికి చేరుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అభినందన్‌ దేశంలోని ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేశారని మోదీ ప్రశంసించారు.
ఫైల్‌ ఓపెన్‌ చేస్తే ఏమవుతుందో అన్న భయం మాకు లేదని, పాపం చేసినవారు భయపడతారని విశాఖపట్నంలో నిర్వహించిన 'ప్రజాచైతన్య సభ'కు హాజరైన మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌ను ఏకాకిని చేసి భారత్‌కు అండగా నిలబడితే విపక్షాలు ఆ దేశానికి అనుకూలంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏ.పి ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమైనాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడుతో పాటు వైకాపాకు చెందిన జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
ఈసారి ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగానే ఉండబోవుచున్నది. రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా విజ్ఞానం సంపాదించుకోవడం, దేశానికి సేవను అందించడం కోసం ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే మాట్లాడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
ఆల్‌ఖాయిదా నాటి నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ ఎక్కడ ఉన్నదీ సమాచారం అందిస్తే రూ. 7.08 కోట్లు అందిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా శుక్రవారం వెల్లడించారు. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఎన్నికల సజావుగా జరుగుతాయాఅని మీడియా అడిగిన ప్రశ్నకు అరోరా పై విధంగా సమాధానం ఇచ్చారు. 
School Assembly 2nd March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd March 2019 assembly, 2nd March 2019 assembly,news of the day history,news of the day highlights,2nd march 2019 assembly, march 2nd assembly, dec 2nd historical events, 2nd March 2019 assembly, March 2nd assembly, March 2nd historical events,school related today assembly,school related today news, school related March 2nd information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 2nd,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events
Previous
Next Post »
0 Komentar