Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CA Exams will be held in November


CA Exams will be held in November



నవంబర్‌లో సీఏ పరీక్షలు
 సీఏ ఫౌండేషన్‌ ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం ప్రకటించింది. ఫౌండేషన్‌ కోర్సు (కొత్త స్కీం) పరీక్షలు నవంబర్‌ 9, 11, 15, 17వ తేదీల్లో జరుగుతాయని తెలిపింది. ఐపీసీ (పాత స్కీం) పరీక్షలు గ్రూప్‌-1 నవంబర్‌ 2, 4, 6, 8వ తేదీల్లో.. గ్రూప్‌-2 నవంబర్‌ 10, 12, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags