Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BDL Recruitment 2020: Apply Online For 119 Apprentice Posts

 


BDL Recruitment 2020: Apply Online For 119 Apprentice Posts

బీడీఎల్‌‌లో 119 ఇంజినీరింగ్ అప్రెంటిస్‌ ఖాళీలు.. బీటెక్‌/డిప్లొమా అర్హత..!

భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 119 అప్రెంటిస్‌ల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలో ప‌నిచేసే భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 119 అప్రెంటిస్‌ల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఇందులో మెద‌క్ జిల్లాలోని భానూర్ బీడీఎల్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. భానూర్‌లోని ఖాళీల‌కు న‌వంబ‌ర్ 20 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మిగిలిన వాటికి NATS పోర్టల్‌లో నవంబర్‌ 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు‌: 119

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు- 83

టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌- 36 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 18, 2020

వెబ్‌సైట్‌: http://www.mhrdnats.gov.in/

 

నోటిఫికేషన్‌: 

Notification_BDL_Bhanur

Previous
Next Post »
0 Komentar

Google Tags