Project Assistant Jobs in Cochin
Shipyard Limited
డిప్లొమా అర్హతతో జాబ్స్..
కొచ్చిన్ షిప్‌యార్డ్ ఉద్యోగాలకు ప్రకటన
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 56 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న కంపెనీ అయిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన 56 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమర్సియల్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 27 దరఖాస్తుకు చివరి తేది. పూర్తి వివరాలకు https://cochinshipyard.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
పోస్టు పేరు: ప్రాజెక్ట్
అసిస్టెంట్
మొత్తం ఖాళీలు: 56
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్,
ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్,
సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమర్సియల్, ఫైనాన్స్ తదితర పోస్టులున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్), పీజీ డిగ్రీ(కామర్స్)
ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 27.10.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్
ఆన్‌లైన్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 27, 2020.
వెబ్‌సైట్: https://cochinshipyard.com/
0 Komentar