Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Gurukul V-TG CET-2020 Results Released

 

Telangana Gurukul V-TG CET-2020 Results Released

గురుకుల సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ గురుకుల సెట్-20 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సెట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఫలితాలను వెల్లడించారు. నాలుగు సొసైటీ ల పరిధిలో ఐదో తరగతికి సంబంధించి మొత్తం 46,987 సీట్లున్నాయి. ఈ ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు పాఠశాల వారీగా సీట్లు కేటాయించా రు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 7 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని, సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో పాటు టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందని కన్వీనర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీల్లో సంబంధిత పాఠశాలల్లో రిపోర్టు చేయని -విద్యార్థుల సీటు రద్దవుతుందని, ఈ క్రమంలో ఆ సీటును ఖాళీ గా చూపించడం జరుగుతుందన్నారు. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ లో భర్తీ చేస్తామని తెలిపారు.

అభ్యర్థులు ఫలితాల కోసం www.tswreis.in, https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags