Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 08-12-2020

 

TS Covid-19 Media Bulletin 08-12-2020

తెలంగాణలో కొత్తగా 682 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 55,645 నమూనాలను పరీక్షించగా 682 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,74,540కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1477కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 761 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,65,367కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,696 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 58,68,233కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 119మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags