Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC National Eligibility Test (UGC-NET) December 2020 Cycle (May 2021)

 

UGC National Eligibility Test (UGC-NET) December 2020 Cycle (May 2021)

యూజీసీ-నెట్‌ పరీక్ష తేదీలు విడుదల నేటి (ఫిబ్ర‌వ‌రి 2) నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం 

యూజీసీ-నెట్‌ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ మేరకు నేడు (ఫిబ్ర‌వ‌రి 2) మధ్యాహ్నం ఆయన ట్వీట్‌ చేశారు. దీంట్లో స్కోరు సాధిస్తే జూనియర్ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు.  

యూజీసీ నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2 నుంచి (నేటి నుంచి) మార్చి 2వరకు అభ్యర్థులు ugcnet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 3 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కి ఎంపికైనవారు స్టైపెండ్‌తో కూడిన పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్‌, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.

WEBSITE

Information Bulletin

NOTICE

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags