Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 15-03-2021

 

TS Covid-19 Media Bulletin 15-03-2021

తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 38,517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, 157 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1654కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 166 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,681కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,983 ఉండగా, వీరిలో 718 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,38,982కి చేరింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags