Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆదర్శ పాఠశాలలలో 2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశం కొరకు ప్రకటన

 

ఆదర్శ పాఠశాలలలో 2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశం కొరకు ప్రకటన


ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2021–2022 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు:

1) వయస్సు: ఒ.సి., బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2009 మరియ 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2007 మరియు 31-08 -2011 మధ్య పుట్టి ఉండాలి.

2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2020-21 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయు విధానము: అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 16-04-20201 నుండి 15.05.2021 30-06-2021 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. 

4) దరఖాస్తు చేయడానికి రుసుము: OC మరియు BC లకు: రూ. 100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)

SC మరియు ST లకు: రూ. 50/- (అక్షరాల 50/- రూపాయలు మాత్రమే)

5) ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

WEBSITE

NOTIFICATION

PRESS NOTE

APPLICATION

PAYMENT

USER MANUAL

Previous
Next Post »
0 Komentar

Google Tags