Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 22-05-2021

 

AP Covid-19 Media Bulletin 22-05-2021

ఏపీలో కొత్తగా 19,981  కరోనా కేసులు

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ ఉద్ధృతి ఆగడంలేదు. శనివారం దాదాపు 20వేల కొత్త కేసులు; 100కి పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 90,609 శాంపిల్స్‌ పరీక్షించగా, 19,981 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.85కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించగా, 15,62,060 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 13,41,355 మంది కోలుకోగా, 10,022 మంది మరణించారు. ప్రస్తుతం 2,10,683 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఏపీలో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 10వేల మార్కును దాటేసింది. శనివారం ఒక్కరోజే 118 మరణాలు నమోదు కావడంతో మొత్తం కొవిడ్‌ మృతుల సంఖ్య 10,022కి పెరిగింది. శనివారం నమోదైన మరణాల్లో పశ్చిమగోదావరిలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, చిత్తూరులో 14, తూర్పుగోదావరి 11, విశాఖ 11, గుంటూరు 10, అనంతపురం 9, కృష్ణా 9, శ్రీకాకుళం 8, విజయనగరం 8, కర్నూలు 7, నెల్లూరు 7, ప్రకాశం 7, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు.

AP BULLETIN 22-05-2021

Previous
Next Post »
0 Komentar