Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel mobile, DTH, Fibre Subscribers: New Combo Airtel Black Plan Makes Billing Easier

 

Airtel mobile, DTH, Fibre Subscribers: New Combo Airtel Black Plan Makes Billing Easier

ఎయిర్‌టెల్‌ నుంచి కొత్తగా ‘ఎయిర్‌టెల్‌ బ్లాక్‌’: మొబైల్‌+ డీటీహెచ్‌+ ఫైబర్‌ - ఒకే ప్లాన్‌లో అన్నీ!

డీటీహెచ్‌, మొబైల్‌, ఫైబర్‌, ఇలా నెలకు వివిధ రకాల సర్వీసులకు వివిధ రకాల ప్లాన్‌లు, బిల్లు చెల్లింపు తేదీలతో విసిగిపోయిన వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్‌ కొత్త ఆల్‌ఇన్‌ వన్‌ ప్యాకేజీ తీసుకొచ్చింది. ‘ఎయిర్‌టెల్‌ బ్లాక్‌’గా పేర్కొంటున్న ఈ సర్వీసుతో డీటీహెచ్‌, మొబైల్‌, ఫైబర్‌ కనెక్షన్లకు కలిపి ఒకే ప్లాన్‌ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న ‘వన్‌ ఎయిర్‌టెల్‌’ సర్వీసుకు మరిన్ని అదనపు ప్రయోజనాలను జత చేసి దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 

దీన్ని ఎంచుకోవాలనుకుంటున్న వినియోగదారులు రెండు లేదా మూడు సేవలకు కలిపి ఓకే బండిల్‌ కింద ప్లాన్‌ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నవారికి ఒక ప్రత్యేక కస్టమర్‌ కేర్‌ నెంబర్‌, ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌, త్వరితగతిన సమస్యల పరిష్కారం, జీరో స్విచ్ఛింగ్‌, ఇన్‌స్టల్లేషన్‌ ఛార్జీలు, ఉచిత ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌, బై నౌ-పే లేటర్‌ వంటి అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ కింద మొబైల్‌, డీటీహెచ్‌, ఫైబర్‌లో కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చారు. ఇది తీసుకోవాలనుకునే వారు కొత్త ప్లాన్‌లనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కొనసాగుతున్న ప్లాన్‌లు మాత్రం ఎయిర్‌ బ్లాక్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత కూడా ఉంటాయి. ఈ కొత్త సర్వీసు వివరాల కోసం ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక మైక్రో సైట్‌ని కూడా ఉంచారు. 

ఎయిర్‌టెల్‌ బ్లాక్ ప్లాన్‌లు

3 మొబైల్‌ + 1 ఫైబర్ ‌+ 1 డీటీహెచ్‌ - రూ.2,099

2 మొబైల్‌ + 1 ఫైబర్‌ - రూ.1,598

3 మొబైల్‌ + 1 డీటీహెచ్‌ - రూ.1,349

2 మొబైల్‌ + 1 డీటీహెచ్‌ - రూ.998

 

WEBSITE

AIRTEL APP

Previous
Next Post »
0 Komentar

Google Tags