AP
Covid-19 Media Bulletin 08-07-2021
ఏపీలో
కొత్తగా 2,982 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,070 పరీక్షలు నిర్వహించగా.. 2,982 కేసులు
నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,14,213 మంది వైరస్
బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో
కొవిడ్ వల్ల 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల
సంఖ్య 12,946కి చేరింది.
24
గంటల వ్యవధిలో 3,461 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి
సంఖ్య 18,69,417కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం
రాష్ట్రంలో31,850 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు
2,26,99,142 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో
ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
0 Komentar