Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Olympic Games Weirdest Rules - ఒలింపిక్స్‌లో వింత నిబంధనలు ఇవే

 

The Olympic Games Weirdest Rules - ఒలింపిక్స్‌లో వింత నిబంధనలు ఇవే 

====================

మామూలుగా క్రీడల్లో వివిధ రకాల నిబంధనలు ఉంటాయి. ఒలింపిక్స్‌లో మరికొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. కానీ ఈ ఒలింపిక్స్‌లో వింతగా, హాస్యాస్పదంగా ఉన్న మనకు తెలియని రూల్స్‌ ఎన్నో ఉన్నాయి. ఓసారి వాటి గురించి తెలుసుకుందామా!

* ఏ విభాగంలో పోటీ పడుతున్నా బాక్సర్లు తప్పకుండా క్లీన్‌ షేవ్‌తో ఉండాలి. మరీ తప్పదనకుంటే పెన్సిల్‌ కట్‌ మీసాలతో బరిలో దిగడానికి మాత్రం అనుమతిస్తారు.

* జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనే జిమ్నాస్ట్‌లు వేలి గోళ్లకి రంగురంగుల నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. మొహానికి కలర్‌ఫుల్‌ మేకప్‌ వేసుకున్నా ఓకే గానీ గోళ్లకి మాత్రం నో!

* అన్యాయం జరిగిందనో, జడ్జీలు తక్కువ మార్కులు వేశారనో.. క్రీడాకారులు ధర్నాలు చేస్తామంటే కుదరదు. ఈ తరహా నిరసనలు పూర్తిగా నిషిద్ధం. మైదానాలు, కోర్టులు, బౌట్‌లు, ఈతకొలనులే కాదు.. క్రీడా గ్రామంలో ఎక్కడా తన అసంతృప్తి వెళ్లగక్కడానికి అనుమతించరు.

* స్కేటింగ్‌లో మగ ఫిగర్‌ స్కేటర్లు బిగుతైన, ఒంటికి అతుక్కుపోయే దుస్తులు ధరిస్తారని భావిస్తుంటాం. కానీ మన అంచనా తప్పు. వీళ్లు కేవలం ట్రౌజర్లు మాత్రమే ధరించాలనే నిబంధన ఉంది. దీనికి భిన్నంగా మహిళా స్కేటర్లు తప్పనిసరిగా స్కర్టులే వేసుకోవాలి.

* పతకం నెగ్గిన ఆనందంలో పోటీ పడుతున్న ఫీల్డ్‌లో.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం నిషేధం. ఆ మాటకొస్తే పోటీలో ఉండే ఆటగాళ్లతోపాటు కేవలం కోచ్‌ మాత్రమే ఆ పరిసరాల్లోకి రావడానికి అనుమతి ఉంటుంది.

* ఎవరైనా స్విమ్మర్‌ వరల్డ్‌ రికార్డు సృష్టిస్తే ఆటోమేటిగ్గా ఆ రికార్డు నమోదు కాదు. ఆ అథ్లెట్‌ వాళ్ల రికార్డును ఫ్యాక్స్‌ చేయాల్సి ఉంటుంది.

* రెజ్లర్లు తప్పనిసరిగా తమ వెంట ఒక రుమాలు (కర్చీఫ్‌) ఉంచుకోవాల్సిందే. దీన్ని ‘బ్లడ్రాగ్‌’ అంటారు. ఆటలో గాయాలు తగిలి రక్తం కారుతుంటే తుడుచుకోవడానికట.

* బీచ్‌ వాలీబాల్‌లో తప్పనిసరిగా బికినీలు ధరించాల్సిందే. ఆ బికినీలోని బాటమ్‌ పరిమాణం 7 సెంటీమీటర్లకన్నా మించి ఉండకూడదు. చిత్రంగా ఉంది కదూ!

* ఈక్వెస్ట్రియన్‌ అంటే గుర్రాలతో విన్యాసాలు చేసే ఆట. పోటీ ముగిసేంతవరకు ఆటగాడు నోరు తెరవకూడదు. గుర్రాన్ని కనీసం అదిలించకూడదు. నిబంధన మీరితే పోటీలో చివరి స్థానం ఇస్తారు.

* వాటర్‌ పోలో గేమ్‌లో ఆట మొదలవడానికి ముందే తప్పనిసరిగా క్రీడాకారుల కాలి, చేతివేళ్లు పరిశీలిస్తారు. గోళ్లు పెద్దవిగా ఉంటే కత్తిరిస్తారు. అనవసర గాయాలు కాకుండా ఉండటానికే ఇలా చేస్తారు.

* బీచ్‌ వాలీబాల్‌లో క్రీడాకారులు తమకి నచ్చిన యూనిఫాం వేసుకోవచ్చు. ఒకవేళ రెండు జట్లూ ఒకే రంగువి ఇష్టపడితే నాణెంతో టాస్‌ వేసి ఎవరు ఏం వేసుకోవాలో తేలుస్తారు.

* డైవర్లు డైవింగ్‌ చేసేముందు బోల్డ్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఏమాత్రం నెర్వస్‌గా ఉన్నా, భయపడతున్నా.. రెండున్నర పాయింట్ల కోత విధిస్తారు. ఆత్మవిశ్వాసం లేకపోతే పాయింట్ల కోత.. భలే చిత్రంగా ఉంది కదూ!

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags