Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

This Indian Guru's '3-Word Reality' is Most Viewed Facebook Post

 

This Indian Guru's '3-Word Reality' is Most Viewed Facebook Post

Facebook: 80.6 మిలియన్ల వ్యూస్‌తో గౌర్‌ గోపాల్‌ దాస్ వర్డ్‌పజిల్‌ ఫేస్‌బుక్‌ పోస్టు రికార్డ్‌

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ నెటిజన్లు ఎక్కువగా చదివిన వార్తల గురించి వెల్లడించింది. టాప్ పెర్ఫార్మింగ్‌ కంటెంట్‌ తొలి రిపోర్టులో భాగంగా ఈ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ మీడియా బీబీసీ నివేదిక  ప్రకారం.. రాజకీయ అంశాలే కాకుండా మీమ్స్‌, వైరల్‌ ఛాలెంజెస్‌, ఆలోచింపజేసే ప్రశ్నలతోనూ ఫేస్‌బుక్‌ వ్యూస్‌తో ముందుకు దూసుకెళ్తోందని తేలింది.

కాగా భారతదేశానికి చెందిన గౌర్‌ గోపాల్‌ దాస్‌ పెట్టిన పోస్టుకు విశేష ఆదరణ లభించడం విశేషం. ‘‘మీరు మొదట చూసిన పదాలే.. మీ రియాలిటీ’’ అంటూ పెట్టిన ఓ పోస్టుని ఏకంగా 80.6మిలియన్ల మంది చూశారట. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్ 30 వరకూ సేకరించిన ఫేస్‌బుక్ డేటాలో ఈ విషయం వెల్లడైంది. గౌర్‌గోపాల్‌ దాస్‌.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయిత భారత్‌లో ప్రసిద్ధి. ‘పర్సనాలిటీ టెస్ట్‌’ అంటూ ఆయన అడిగే ప్రశ్నలు ఆలోజింపజేసేలా ఉంటాయి . అంతేకాదు.. జీవితం, వ్యక్తిత్వం, ఆలోచన తీరు వంటి అంశంలో ఆయనిచ్చే ప్రసంగాలు, సంధించే ప్రశ్నలు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో విశేష ఆదరణ ఉంటుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags