Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Need an LPG connection? Just give a missed call to 8454955555

 

Need an LPG connection? Just give a missed call to 8454955555

గ్యాస్‌ కొత్త కనెక్షన్‌ తో పాటు మరో రెండు సేవలు కోసం 8454955555కు మిస్డ్‌కాల్‌ - ఐఓసీ కొత్త సదుపాయం

దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇండేన్‌ వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) కనెక్షన్‌ కోసం 8454955555 నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుత వినియోగదారులు నమోదిత ఫోన్‌ నంబరు నుంచి ఈ నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

దేశంలో ఎక్కడైనా మిస్డ్‌కాల్‌తో కొత్త ఎల్‌పీజీ కనెక్షన్‌ పొందే సౌకర్యాన్ని సోమవారం ఐఓసీ ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య ప్రారంభించారు. వినియోగదారుడి ఇంటి వద్దే రెండో సిలెండర్‌ (డబుల్‌ బాటిల్‌ కనెక్షన్‌-డీబీసీ) పొందే సదుపాయాన్ని మొదలుపెట్టారు. ఒకే సిలెండర్‌ కలిగిన వారు వినియోగదారులు డీబీసీకి మారే అవకాశాన్ని డెలివరీ సిబ్బంది కల్పిస్తారు.

Previous
Next Post »
0 Komentar