Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APBIE: నేటి నుంచి ఇంటర్ రెండో విడత ప్రవేశాలు – వివరాలు ఇవే

 

APBIE: నేటి నుంచి ఇంటర్ రెండో విడత ప్రవేశాలు – వివరాలు ఇవే

ఇంటర్ ప్రథమ సంవత్సరం రెండోవిడత ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబరు ఒకటి నుంచి ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మొదటి విడత గడువు ఆగస్టు 27తో ముగిసిందని, కళాశాలలను ఎంపికకు ఐచ్చికాలు ఇచ్చినవారికి త్వరలోనే సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

మొదటి విడతలో పొందిన సీటుపై సంతృప్తి చెందనివారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్లైన్ ప్రవేశాలపై సందేహాలుంటే 18002749868 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చని వెల్లడించారు.

ఇంటర్ తరగతులు వాయిదా

ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణ వాయిదా పడింది. ఇంటర్ విద్యామండలి మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం బుధవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇంతవరకూ ప్రవేశాలు పూర్తి కాలేదు. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ పూర్తయినా సీట్లు కేటాయించలేదు. దీంతో తరగతుల నిర్వహణ వాయిదా పడింది. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభించనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags