Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Academic Year 2021-22 Details

 

TS: Academic Year 2021-22 Details 

తెలంగాణ విద్యా సంవత్సరం 2021-22: మొత్తం పని దినాలు 213 -  సెలవుల వివరాలు ఇవే - 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఈ నెల 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ  2021-22  విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది.

213 పనిదినాలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబర్‌ 6 నుంచి 17 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

అలాగే, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు.. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు వేసవి సెలవులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.


10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే

2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ.. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10, 2022 లోపు సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఫిబ్రవరి 28 నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి, ఏప్రిల్ నెలల్లో టెన్త్ వార్షిక పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. స్కూళ్ల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 అని చెప్పారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags