Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

 

AP: మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల – ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కారణాలతో గతంలో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్‌ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈనెల 14, మున్సిపాలిటీలకు 15, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 15న నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈనెల 17న మున్సిపాలిటీ, 18న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీలివే..

ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ.

SCHEDULE AND DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags