Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Prepaid Recharge Plan With 1-Year Disney+ Hotstar Subscription: Details Here

 

Jio Prepaid Recharge Plan With 1-Year Disney+ Hotstar Subscription: Details Here

డిస్నీ+ హాట్‌స్టార్‌ 1-సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ - వివరాలు ఇవే

రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్‌ ధర రూ.499గా నిర్ణయించింది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటాను పొందవచ్చు. రోజులో 2జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్‌ వేగం 64kbpsకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్‌ కింద కొత్త వారు వివిధ జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతోపాటు, ఏడాది కాలపరిమితితో డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గతేడాది ఆగస్టులో జియో ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది. అయితే డిసెంబరులో ధరను సవరించి రూ. 601కు పెంచింది. తాజాగా ఈ ప్లాన్‌ ధరను రూ. 499కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

JIO WEBSITE

MY JIO APP

Previous
Next Post »
0 Komentar

Google Tags