Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

 

TS: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటి (Jan 17)తో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది.

* ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

* అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్‌.

* తెలంగాణలో తాజాగా ఒక్కరోజులో 1,963 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 22, 017గా ఉంది.

script async="" src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js">
Previous
Next Post »
0 Komentar

Google Tags