Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2022: Jio Announces New Plans with Disney+Hotstar - All New Jio Cricket Plans

 


IPL 2022: Jio Announces New Plans with Disney+Hotstar - All New Jio Cricket Plans

క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త ప్లాన్‌లు - యాడ్‌ఆన్‌ ప్లాన్‌తో రీఛార్జ్‌ - డేటా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ - వివరాలు ఇవే

ఐ‌పి‌ఎల్ ప్రియుల కోసం జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. 55 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్‌ ధర ₹555గా నిర్ణయించింది. ఈ డేటా యాడ్‌ఆన్‌ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లు 55 జీబీ డేటా, ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందుతారు. అయితే ఇందులో వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ సేవలు ఉండవు. 

ఈ ప్లాన్‌తో పాటు జియో ₹2,999 కూడిన మరో ప్లాన్‌ను కూడా ప్రకటించింది. దీని కాలపరిమితి 365 రోజులు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లు రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతోపాటు ఏడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, అన్ని జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.

ప్రస్తుతం టీ20 లీగ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. వినియోగదారులు మైజియో యాప్‌ లేదా జియో వెబ్‌సైట్‌తోపాటు వివిధ థర్డ్‌పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్‌ల నుంచి కూడా రీఛార్జ్‌ చేసుకోచ్చు. ఈ ప్లాన్‌లను రీఛార్జ్‌ చేసుకున్న తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం కూపన్‌ కోడ్ వస్తుంది. దానితో డిస్నీ+ హాట్‌స్టార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. 

ఇవే కాకుండా క్రికెట్‌ అభిమానుల కోసం జియో ₹499 (28 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹601 (28 రోజులు/ 3జీబీ డేటా రోజుకు), ₹799 (56 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹1,066 (84 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹1,499 (84 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹3,119 (365 రోజులు/2జీబీ డేటా రోజుకు), ₹4,199 (365 రోజులు/3జీబీ డేటా రోజుకు) ప్లాన్లను అందిస్తోంది. డేటా యాడ్‌ఆన్‌ కేటగిరీలో ₹659 (58 రోజులు/1.5జీబీ డేటా) ప్లాన్‌ అందుబాటులో ఉంది.

JIO CRICKET PLAN

JIO APP

Previous
Next Post »
0 Komentar

Google Tags