Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Royal Enfield Scram 411 Launched: Price, Features and Specs Details Here

 

New Royal Enfield Scram 411 Launched: Price, Features and Specs Details Here

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త బైక్‌ స్క్రామ్‌ 411 విడుదల – ధర మరియు  ఫీచర్ల వివరాలు ఇవే

ధర రూ.2.03 లక్షలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త బైక్‌ స్క్రామ్‌ 411ను విపణిలోకి విడుదల చేసింది. పరిచయ ఆఫర్‌ కింద రూ.2.03 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ చెన్నై) నుంచి ఈ బైక్‌ విక్రయిస్తామంది. రంగును బట్టి స్క్రామ్‌ 411 ధరలు రూ.2,03,085- 2,08,593 శ్రేణిలో ఉన్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎల్‌ఎస్‌-410 ఇంజిన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ బైక్‌ను తయారుచేశారు.

దృఢత్వం కలిగిన సరికొత్త ఛాసిస్‌తో పట్టణ రహదారులతో పాటు కఠిన మార్గాల్లోనూ మెరుగ్గా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.  411 సీసీ, 4-స్ట్రోక్‌ సింగిల్‌-సిలిండర్‌ ఇంజిన్‌ 6500 ఆర్‌పీఎం వద్ద 24.3 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుందని, గరిష్ఠ టార్క్‌ 32 ఎన్‌ఎం అని వివరించింది. డిజిటల్‌ స్క్రీన్‌పై ఆటో మీటర్‌, ట్రిప్‌ మీటర్‌, టైమ్‌, ఫ్యూయల్‌ గేజ్‌, సర్వీస్‌ రిమైండర్‌ వంటి సంకేతాలు, ముందు-వెనుక డిస్క్‌ బ్రేక్‌లు, డ్యూయల్‌-ఛానెల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

BIKE OFFICIAL DETAILS

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags