Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Scooter ‘Gerua’ Colour Holi Edition Launched - Open Next Purchase Window on Mar 17, 18

 

Ola Electric Scooter ‘Gerua’ Colour Holi Edition Launched - Open Next Purchase Window on Mar 17, 18

ఓలా ఎలక్ట్రికల్ నుండి సరికొత్త అప్ డేట్ - హోలీ పండుగ సందర్భంగా సరికొత్త ‘గెరువా’ కలర్ వేరియంట్‌

మార్చి 17, 18 తేదీల్లో మాత్రమే కొనుగోలుకు అవకాశం

ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా గత ఏడాది ఎస్1, ఎస్1ప్రో పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన కొత్త 2.0 అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ సరికొత్త 2.0 అప్‌డేట్ రెండు స్కూటర్ల వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ కొత్త 'MoveOS 2.0' లో నావిగేషన్, క్రూజ్ కంట్రోల్, బ్లూటూత్ మొదలైన ఫీచర్స్ మరింత అప్ డేట్ కానున్నాయి.

అదే విధంగా హోలీ పండుగ సందర్భంగా సరికొత్త ‘గెరువా’ కలర్ వేరియంట్‌ను కూడా సంస్థ ఆవిష్కరించింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ ‘గెరువా’ రెండు రోజులు మాత్రమే, అంటే మార్చి 17, 18 తేదీల్లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags