Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS INTER EXAMS – 2022 Results Update

 

TS INTER EXAMS – 2022 Results Update

టీఎస్ ఇంటర్ పరీక్షలు – 2022: ఫలితాల విడుదల అప్డేట్

ఈ నెల 25 న ఫలితాలు విడుదల?

తెలంగాణ లోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ నెల 25 విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.

ఫలితాలను జూన్ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తయినందున తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం.

సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags