Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Govt Gives Green Signal for Filling Up 1663 Vacancies in Irrigation And R&VB Departments

 

TS: Govt Gives Green Signal for Filling Up 1663 Vacancies in Irrigation And R&VB Departments

తెలంగాణ లో నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖల్లోని 1663 ఉద్యోగాల భర్తీకి అనుమతి

తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం మరో 1,663 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో ఇంజినీరింగ్ పోస్టులు 1,522 ఉన్నాయి.

నీటిపారుదల, ఆర్ అండ్ బీ శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్ పోస్టులు సహా 1663 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా అనుమతిచ్చిన వాటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భూగర్భ జలశాఖలో 88 పోస్టులు, రోడ్లు, భవనాలశాఖలో 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్

ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మిగిలిన పోస్టుల భర్తీకి కూడా అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags