Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2022: Apply for 24369 Constable GD Posts – Details Here

 

SSC Recruitment 2022: Apply for 24369 Constable GD Posts – Details Here

స్టాఫ్ సెలక్షన్ కమిషన్: కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ / రైఫిల్ మ్యాన్ / సిపాయి పోస్టులు పూర్తి వివరాలు ఇవే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 24,369 కానిస్టేబుల్/ రైఫిల్ మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్ బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు: అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్ సీబీ)లో సిపాయి పోస్టులు భర్తీకి ఎస్ఎస్ సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.

పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)/ రైఫిల్ మ్యాన్(జనరల్ డ్యూటీ)/ సిపాయి: 243369 పోస్టులు

పార్ట్ - 1 ఖాళీలు:

1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్): 10497 పోస్టులు (పురుషులు- 8922; మహిళలు- 1575)

2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్): 100 పోస్టులు (పురుషులు- 90, మహిళలు- 10)

3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్): 8911 పోస్టులు (పురుషులు- 8880, మహిళలు- 531)

4. సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్ బీ): 1284 పోస్టులు (పురుషులు- 1041; మహిళలు- 243)

5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ): 1613 పోస్టులు (పురుషులు- 1371; మహిళలు- 242)

6. అస్సాం రైఫిల్స్ (ఏఆర్): 1697 పోస్టులు (పురుషులు-1697)

7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్): 103 పోస్టులు (పురుషులు- 78; మహిళలు- 25)

పార్ట్ - 2 ఖాళీలు:

8. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ): 164 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి: జనవరి 01, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2000 కంటే ముందు, 01-01-2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: సిపాయి పోస్టుకు రూ.18,000-రూ.56,900 వరకు, ఇతర ఖాళీలకు రూ.21,700-రూ.69,100 మధ్య చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ / హిందీ అంశాలనుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. 

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు…

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 27-10-2022 నుంచి 30-11-2022 వరకు.

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30-11-2022.

ఆన్లైన్ చలానా రూపొందించేందుకు చివరి తేదీ: 30-11-2022.

ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-12-2022.

చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-12-2022

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: జనవరి, 2023

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar