Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2023: BCCI Announces Schedule for TATA IPL 2023

 

IPL 2023: BCCI Announces Schedule for TATA IPL 2023

ఐపీఎల్‌ 2023 షెడ్యూల్‌ విడుదల - గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్‌

=======================

టాటా ఐపీఎల్ 16వ సీజన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 31వ తేదీన గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది. లీగ్ వరకు షెడ్యూల్ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ప్రకటించాల్సి ఉంది.

పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2023 సీజన్ లో  మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఏడేసి మ్యాచ్ లను సొంత మైదానం, ఇతర స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ - Aలో ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూప్ - Bలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. మొత్తం మ్యాచుల కోసం 12 వేదికలను ఐపీఎల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అహ్మదాబాద్, మొహాలి, లఖ్నవూ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, జయ్పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్ లు జరుగుతాయి.

మార్చి 31 నుంచి ప్రారంభమై మే 28న ముగుస్తాయి.

=======================

CLICK FOR IPL-2023 SCHEDULE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags