Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel New Prepaid Plans with 3 OTT Subscriptions – Details Here

 

Airtel New Prepaid Plans with 3 OTT Subscriptions – Details Here

ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజువారీ డేటాతో పాటు తో  పాటు మూడు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు - వివరాలు ఇవే

=========================

ఎయిర్ టెల్ తమ యూజర్ల కోసం అనేక రకాల ప్రీపెయిడ్ ప్యాక్ లను అందిస్తోంది. అపరిమిత ప్లాన్లు, డేటా యాడ్-ఆన్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు (OTT Subscriptions).. ఇలా వివిధ కాంబినేషన్లలో రీఛార్జ్ ఆప్షన్లను ఇస్తోంది. ఈ క్రమంలో సరిపడా రోజువారీ డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలు కావాలనుకునేవారికి రూ.999తో ఎయిర్ టెల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది.

ప్లాన్ వివరాలు..

• రోజుకు 2.5 జీబీ డేటా

• అపరిమిత వాయిస్ కాల్స్

• రోజుకి 100 ఎస్ఎంఎస్లు

• కాలపరిమితి 84 రోజులు

• మూడు నెలల వరకు అపోలో 24x7 సర్కిల్ సేవలు

• ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్ బ్యాక్

• ఉచిత వింక్ మ్యూజిక్

• ఉచిత హలో ట్యూన్స్

• రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్ 



మూడు ఓటీటీ సబ్స్క్రిప్షన్ల వివరాలు

మూడు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉండడం ఈ ప్లాన్ ప్రత్యేకత. అదీ 84 రోజుల కాలపరిమితితో. ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వారు మూడు నెలల కాలపరిమితో డిస్నీ+ హాట్ స్టార్  మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. అలాగే 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా వస్తుంది. వీటితో పాటు 84 రోజుల గడువుతో ఎక్స్ట్రీమ్ యాప్ యాక్సెస్ కూడా పొందొచ్చు. ఎక్స్ట్రీమ్ లో ఉండే సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఈరోస్ నౌ, మనోరమామ్యాక్స్, చౌపల్, కచ్చాలంకా.. వీటిలో ఏదైనా ఒక ఛానెల్ ను ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండానే పొందొచ్చు. ఇలా మొత్తంగా మూడు ఓటీటీలను ఎంజాయ్ చేయొచ్చు.

=========================

MOBILE APP

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags