Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EPFO Recruitment 2023: Apply for 2674 Social Security Assistant Posts – Details Here

 

EPFO Recruitment 2023: Apply for 2674 Social Security Assistant Posts – Details Here

ఈపీఎఫ్ వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300.

=======================

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్ వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్ఎస్ఏ- గ్రూప్ సి): 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో 39, తెలంగాణ రీజియన్ లో 116 ఖాళీలు ఉన్నాయి)

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్సీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్ లకు 529, అన్ రిజర్వ్డ్కు 999 కేటాయించారు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు), కంప్యూటర్ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27-03-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-04-2023

=======================

APPLY HERE

NOTIFICATION

RECRUITMENT WEBSITE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags