Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET – Central Teacher Eligibility Test - August 2023: All the Details Here

 

CTET – Central Teacher Eligibility Test - August 2023: All the Details Here

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఆగస్టు 2023: పూర్తి వివరాలు ఇవే

=========================

UPDATE 25-09-2023

సీటెట్ ఆగస్టు-2023 ఫలితాలు విడుదల

సీటెట్ ఆగస్టు -2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను CTET అధికారిక వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ను ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు.

ఆగస్టు 20న ఈ పరీక్షను దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించగా దాదాపు 29లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్ 1 (1 నుంచి ఐదో తరగతి వరకు బోదించేవారు)కు 15,01,719మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. పేపర్- 2 (6 నుంచి 9వ తరగతి వరకు)కు 14,02,184 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 80శాతానికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. సెప్టెంబర్ 16న ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరించిన అనంతరం తాజాగా ఫలితాలు విడుదల చేశారు. సీటెట్లో సాధించిన స్కోర్కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది.

CLICK FOR RESULTS

PUBLIC NOTICE

WEBSITE

=========================

UPDATE 16-09-2023

సీటెట్ ఆగస్టు 2023 పరీక్షల కీవిడుదల

సీటెట్ ఆగస్టు 2023 ‘కీని సీబీఎస్ఈ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కీతో పాటు ఓఎంఆర్ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం సెప్టెంబర్ 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కీపై అభ్యంతాలు ఉంటే సెప్టెంబర్ 18వ తేదీలోగా రూ.1000 ఫీజుతో తెలియజేయవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీటెట్ (పేపర్-1, పేపర్-2) ఆగస్టు 20న నిర్వహించిన విషయం తెలిసిందే.

KEY

PRESS NOTE

WEBSITE

=========================

UPDATE 20-08-2023

పరీక్ష తేదీ: 20-08-2023  

CTET – Question Paper (Paper-1) 👇

CLICK HERE

=========================

UPDATE 18-08-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 20/08/2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=========================

UPDATE 01-08-2023

ప్రీ-అడ్మిట్ కార్డ్ విడుదల

DOWNLOAD PRE-ADMIT CARD

WEBSITE

=========================

UPDATE 10-06-2023

పరీక్ష తేదీ: 20/08/2023

PRESS NOTE

WEBSITE

=========================

ఉపాధ్యాయ వృత్తిని కెరీర్ గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జులై -2023 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 17వ ఎడిషన్ సీటెట్ రిజిస్టేషన్లు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై - 2023

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27-04-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26-05-2023.

హాల్ టికెట్ల విడుదల తేదీ: 18-08-2023  

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 20-08-2023

=========================

INFORMATION BULLETIN

APPLY HERE

PUBLIC NOTICE 25 -04-2023

CTET WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags