Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Intermediate 2023-24 Academic Calendar Released - Details Here

 

TS Intermediate 2023-24 Academic Calendar Released - Details Here

టి‌ఎస్: ఇంటర్మీడియట్ 2023-24 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల - వివరాలు ఇవే

=======================

తెలంగాణ లో వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ ను ఇంటర్ బోర్డు శనివారం (ఏప్రిల్ 1) ప్రకటించింది. వేసవి సెలవులు మొదలైన రోజే విద్యా క్యాలెండర్ ను ప్రకటించడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మొత్తం 227 రోజులపాటు కళాశాలలు పనిచేస్తాయి. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు 304 రోజుల్లో 77 రోజులు ఆదివారాలు, పండగలు, ఇతర సెలవులు ఉంటాయి. అంటే 227 రోజులు తరగతులు జరుగుతాయి.

విద్యా క్యాలెండర్ 2023-24

ఇంటర్ ప్రథమ & ద్వితీయ సంవత్సర తరగతుల ప్రారంభం: 01/06/2023 నుండి  

దసరా సెలవులు: 19/10/2023 నుంచి 25/10/2023 వరకు

అర్ధ సంవత్సర పరీక్షలు: 20/11/2023 నుంచి 25/11/2023 వరకు

సంక్రాంతి సెలవులు: 13/01/2024 నుంచి 16/01/2024 వరకు

ప్రీ ఫైనల్ పరీక్షలు: 22/02/2024 నుంచి 29/03/2024 వరకు

ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 2వ వారంలో

వార్షిక పరీక్షలు: మార్చి మొదటి వారంలో

వేసవి సెలవులు: 01/04/2024 నుంచి 31/05/2024 వరకు

=======================

PRESS RELEASE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags