Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Reliance Jio Launches New Bluetooth Tracking Device JioTag – Details Here

 

Reliance Jio Launches New Bluetooth Tracking Device JioTag – Details Here

రిలయన్స్ జియో కొత్త బ్లూటూత్ ట్రాకింగ్ డివైస్ జియోట్యాగ్‌ విడుదల  - ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే

=========================

రిలయన్స్ జియో మరో కొత్త పరికరాన్ని పరిచయం చేసింది. యాపిల్ ఎయిర్ ట్యాగ్ , శామ్సంగ్ స్మార్ట్ ట్యాగ్ తరహాలో 'జియోట్యాగ్' పేరిట బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. తాళంచెవి, పర్సులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు మర్చిపోయే అలవాటున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

జియోట్యాగ్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.2,199గా జియో పేర్కొంది. కానీ, ప్రస్తుతం వెల్కమ్ ఆఫర్ కింద రూ.749కే అందిస్తోంది. జియో, రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లలో ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది. తెలుపు రంగులో ఉన్న ఈ చిన్న గ్యాడ్జెట్ బరువు 9.5 గ్రాములు. దీని పరిమాణం 38.2mm x 38.2mm x 7.2mm. తరచూ మర్చిపోయే అవకాశం ఉన్న వస్తువులకు దీన్ని తగిలించాలి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఇన్స్టాల్ చేసిన జియోథింగ్స్ యాప్ కి కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు జియోట్యాగ్ తగిలించిన వస్తువును వదిలి నిర్దేశిత దూరం దాటి వెళ్లిపోతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.

ఇండోర్ లో 20 మీటర్లు, అవుట్డోర్ లో 50 మీటర్ల వరకు ఈ జియోట్యాగ్  పనిచేస్తుంది. దీంట్లో మార్చుకోగలిగే CR2032 బ్యాటరీ ఉంది. దీనికి ఏడాది వారెంటీ ఇస్తున్నారు. జియోట్యాగ్ ను పరికరాలను సులభంగా అటాచ్ చేసేలా ఒక కేబుల్ ను కూడా అందిస్తున్నారు. జియోట్యాగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కూడా ట్రాక్ చేయొచ్చు. సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ.. జియోట్యాగ్ ను  రెండుసార్లు ట్యాప్ చేస్తే ఫోన్ మోగుతుంది.

పరికరాల ట్రాకింగ్ తో  పాటు జియోట్యాగ్ తీసుకున్నవారికి జియో ఒక ప్రత్యేక సేవను అందిస్తోంది. జియోట్యాగ్ తగిలించిన పరికరాన్ని ఎవరైనా దొంగిలిస్తే దాన్ని జియోథింగ్స్ యాప్ లోని జియో కమ్యూనిటీలో రిపోర్ట్ చేయొచ్చు. తద్వారా పరికరం చివరిసారి నెట్ వర్క్ అందుబాటులో ప్రాంతాన్ని ఫోను నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది.

=========================

PURACHASE LINK

MY JIO APP

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags