Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: School Academic Calendar 2023-24 for Classes I to X

 

TS: School Academic Calendar 2023-24 for Classes I to X

తెలంగాణ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదల

=========================

తెలంగాణ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని నో బ్యాగ్ డే (సంచి రహిత దినంగా పాటించనున్నారు. ఆరోజు పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 6న జారీ చేశారు. ఏడాదిలో మొత్తం 10 రోజుల పాటు పిల్లలు సంచులు లేకుండా బడికి వస్తారు. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై తరువాత మార్గదర్శకాలు జారీ చేస్తారు.

పుస్తక పఠనం

గతేడాది పాఠశాలలు తెరిచిన 16 రోజుల తరువాత క్యాలెండర్ విడుదల చేయగా.. ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి వారం రోజులు ముందుగానే విడుదల చేయడం విశేషం. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. టీవీ పాఠాలు యథావిధిగా ప్రసారం చేస్తారు. కాలపట్టికను సైట్ సంచాలకుడు త్వరలో ప్రకటిస్తారు. రోజూ 30 నిమిషాలపాటు పుస్తకాలు చదివించాలి. అవి పాఠ్య, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజీన్లు తదితరాలు కావొచ్చు. రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. వారానికి 3- 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలి. పదో తరగతి సిలబస్ 2024 జనవరి 10 నాటికి పూర్తి చేయాలి.

సెలవులు

దసరా సెలవులు: అక్టోబరు 13 నుంచి 25 వరకు

క్రిస్మస్ సెలవులు: డిసెంబరు 22 నుంచి 26

సంక్రాంతి సెలవులు: 2024 జనవరి 12 నుంచి 17

మరికొన్ని ముఖ్యాంశాలివీ...

ప్రతి నెల మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.

చివరి పనిదినం: 2024 ఏప్రిల్ 23

వేసవి సెలవులు: ఏప్రిల్ 24 - జూన్ 11 పునఃప్రారంభం: 2024 జూన్ 12

నెలవారీగా పనిదినాలు:

జూన్-16 రోజులు, జులై-23, ఆగస్టు-25, సెప్టెంబరు 22, అక్టోబరు 14,

నవంబరు-24, డిసెంబరు-23, జనవరి-20, ఫిబ్రవరి-24, మార్చి - 23, ఏప్రిల్- 15 రోజులు

=========================

CLICK FOR ACADEMIC CALENDRA 2023-24

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags