Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart Big Dussehra Sale 2023 – Check the Dates and Offers

 

Flipkart Big Dussehra Sale 2023 – Check the Dates and Offers

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దసరా సేల్’ 2023: పండుగ సీజన్ సేల్ తేదీలు & ఆఫర్ వివరాలు ఇవే

=====================

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ కి సిద్ధమైంది. ఇటీవల బిగ్ బిలియన్ డేస్ పేరుతో అతిపెద్ద సేల్ నిర్వహించిన ఆ సంస్థ.. దసరా సందర్భంగా 'బిగ్ దసరా సేల్’ నిర్వహిస్తోంది. అక్టోబర్ 22వ తేదీ నుంచి 29 వరకు మొత్తం 8 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. బిగ్ దసరా సేల్ లో  భాగంగా కోటక్, ఆర్బీఎల్, ఎస్బీఐ కార్డు హోల్డర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఐసీఐసీఐ కార్డు డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ప్లస్ మెంబర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, 21వ తేదీ ఒక్కరోజు మాత్రమే. సూపర్ కాయిన్ల ద్వారా 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీని తర్వాత ఫ్లిప్‌కార్ట్ దీపావళికి ముందు మరో సేల్ నిర్వహించనుంది.

ఇక ఆఫర్ల విషయానికొస్తే.. స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్ లు , ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, దుస్తులపై ఆఫర్లు ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్లపై డీల్స్ ప్రకటించింది. మోటోరొలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 5జీ, గూగుల్ పిక్సెల్ 7, శాంసంగ్ ఎస్ 22 5జీ, పోకో ఎఫ్5, వివో టీ2 ప్రో వంటి మొబైల్స్ పై ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 14 సహా పలు మొబైల్స్ పై త్వరలో ఆఫర్లను రివీల్ చేయనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ధరలే ఇంచుమించు ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్లు మిస్ అయిన వారు ఈ సేల్ లో పాల్గొనొచ్చు.

=====================

MOBILE APP

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags