Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP TET 2024: All the Details Here

 



 AP TET 2024: All the Details Here

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024: ముఖ్యమైన వివరాలు ఇవే

====================

UPDATE 30-03-2024

AP DSC & TET 2024: ఫలితాలు & పరీక్షల అప్డేట్

ఏపీ: డీఎస్సీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్)ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ డీఎస్సీ పరీక్ష, టెట్ పరీక్షా ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా... కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు &  డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.

====================

UPDATE 21-03-2024

AP TET-2024: ఫలితాల విడుదల గురించి అప్డేట్

ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. దీని గురించి ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తే డీఎస్సీకి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టత వస్తేనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.

WEBSITE

====================

UPDATE 18-03-2024

AP TET-2024: అన్నీ పరీక్షల తుది ‘కీ’లు విడుదల

CLICK FOR FINAL KEYS

WEBSITE

====================

UPDATE 09-03-2024

AP TET-2024: అన్నీ పరీక్షల ప్రశ్నా పత్రాలు, 'కీ'లు, రెస్పాన్స్ షీట్స్ విడుదల

QUESTION PAPERS & KEYS

OBJECTIONS ON KEY

CLICK FOR RESPONSE SHEETS

WEBSITE


====================

UPDATE 04-03-2024

ఏపీ టెట్, టీఆర్టీ (DSC) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు ఇదే

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతోన్న టెట్ మరియు టీఆర్టీ (DSC) పరీక్షల షెడ్యూల్ లో మార్పు చెయ్యాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది.

ఇప్పటిదాకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14 న టెట్ ఫలితాలు విడుదల అవుతాయి. మార్చి 15 నుండి టీఆర్టీ (DSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ షెడ్యూల్ లో మార్పులు జరిపి కొత్త షెడ్యూల్ ను విడుదల అవుతుందని తెలిస్తోంది.  

====================

UPDATE 23-02-2024

AP TET 2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 27-02-2024 నుండి 06-03-2024 వరకు

DOWNLOAD HALL TICKETS

EXAMINATION SCHEDULE

AP-TET FEB-2024 NORMALIZATION FORMULA

WEBSITE

====================

AP TET 2024: Mock Tests

CLICK HERE

====================

AP SCERT: 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ (2023) - Useful for AP TET & DSC 2024

CLICK HERE

==================

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు ముహూర్తం ఖరారైంది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్ధులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- 2024

అర్హతలు: పేపర్ ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం. 2023-24 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్ధులూ అర్హులే.

కమ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు

1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆపైన

2. బీసీ- 50% మార్కులు ఆపైన

3. ఎస్సీ/ ఎస్టీ/ పీ హెచ్/ ఎక్స్ సర్వీస్మెన్- 40% మార్కులు ఆపైన

పరీక్ష విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తామన్నారు.

పరీక్ష రుసుము: రూ.750. 

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 08-02-2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 08-02-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 17-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 18-02-2024

ఆన్లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: 19-02-2024

హాల్ టికెట్ల విడుదల తేదీ: 23-02-2024

పరీక్షల తేదీలు: 27-02-2024 నుండి 09-03-2024 వరకు

పరీక్ష సమయం: సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు. సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.

ప్రాథమిక 'కీ' విడుదల: 10-03-2024

అభ్యంతరాల స్వీకరణ: 11-03-2024

తుది ‘కీ’ విడుదల: 13-03-2024

ఫలితాలు విడుదల తేదీ: 14-03-2024

పూర్తి నియామక ప్రక్రియ రోజులు: 35 రోజులు  

====================

PAYMENT

CANDIDATE LOGIN

SYLLABUS

NOTIFICATION

INFORMATION BULLETIN

SCHEDULE

AP DSC & TET - 2024 TENTATIVE DATES

WEBSITE

====================

Reference:

AP TET-2024 -టెట్ పేపర్-1కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారే అర్హులు - అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

G.O.Ms.No:4, Dated: 26/01/2024

CLICK HERE

====================

AP TET- 2024 - రెండో పేపర్ అర్హత మార్కుల్లో మినహాయింపు

Memo.No.1331600 /Services-I/A1/2023, Dated:26/01/2024

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags