Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kinetic E-Luna Launched at Rs 69,900 – Details Here

 

Kinetic E-Luna Launched at Rs 69,900 – Details Here

కైనటిక్ ఇ-లూనా: కైనటిక్ గ్రీన్ నుండి కొత్త ఎలెక్ట్రిక్ లూనా – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే

====================

50 ఏళ్ల క్రితం నుండి ప్రసిద్ది చెందిన కైనటిక్ లూనా ఇప్పుడు కొత్త అవతారంలో తిరిగి మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ మోపెడ్.. ఇ-లూనా (E-Luna) రూపంలో రీఎంట్రీ ఇచ్చింది. కైనటిక్ గ్రీన్ (Kinetic Green) కంపెనీ దీన్ని అధికారికంగా ఫిబ్రవరి 7న ఆవిష్కరించింది. దీని ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది.

కైనటిక్ ఇ-లూనా  ఎక్స్1, ఎక్స్2 పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎక్స్1 వేరియంట్ ధర రూ. 69,990 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కాగా, ఎక్స్ వేరియంట్ ధరను రూ.74,990గా కంపెనీ నిర్ణయించింది. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్2 వేరియంట్లో 2kWh బ్యాటరీ ఇచ్చారు. సింగిల్ ఛార్జ్ పై 110కి. మీ. ప్రయాణించొచ్చు. ఎక్స్1 వేరియంట్లో 1.7kWh బ్యాటరీ ఇచ్చారు. దీంతో సింగిల్ ఛార్జ్  తో 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. స్వాపబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. దీని టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఛార్జింగ్ టైమ్ నాలుగు గంటలు.

ఇతర ఫీచర్ల గురించి

ఇ-లూనాలో టెలీస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ సెన్సర్, యూఎస్బీ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్యాగ్ క్యారీ చేయడానికి హుక్ ఇస్తున్నారు. లగేజీ తీసుకెళ్లేందుకు వీలుగా వెనక సీటు తొలగించుకునే సదుపాయం కూడా ఉంది. రూ.500 చెల్లించి కైనటిక్ గ్రీన్ వెబ్సైట్లో ఇ-లూనాను బుక్ చేసుకోవచ్చు.

====================

WEBSITE

FLIPKART LINK

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags