ICC T20 World Cup 2026: India Beat New
Zealand in The Final - India Set Many Records with This Victory
టీ20 ప్రపంచ కప్ 2026: ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా భారత్ - ఈ విజయంతో అనేక రికార్డులు
సృష్టించిన భారత్
===================
టీమ్ ఇండియా
అసలైన వేళలో అద్భుతంగా పుంజుకుంటూ.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అంతులేని వినోదాన్ని పంచుతూ.. కోట్ల హృదయాలలో సంతోషాన్ని నింపుతూ.. ధనాధన్
టోర్నీని చిరస్మరణీయ రీతిలో ముగించింది. భారత్ ఖాతాలో ముచ్చటగా మూడో టీ20 ప్రపంచకప్పు..!
అహ్మదాబాద్
టీమ్ండియా అదరగొట్టింది. బ్యాటుతో పరుగుల వరద పారించి, బంతితో అలవోకగా ప్రత్యర్థిని పడగొట్టేసిన సూర్యకుమార్ బృందం
విశ్వవిజేతగా నిలిచింది. సొంతగడ్డపై సగర్వంగా కప్పును ముద్దాడింది. ఏకపక్షంగా
సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ చిత్తుగా ఓడించింది.
పొట్టి ప్రపంచ కప్పును నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
భారీ స్కోర్:
టీమ్ ఇండియా ఇన్నింగ్స్ అంతా బాదుడే బాదుడు. విధ్వంసం విరామం లేకుండా సాగిపోయింది.
అదిరే ఫామ్ ను కొనసాగించిన సంజు శాంసన్.. మరోసారి ఇన్నింగ్స్ కు వెన్నెముకలా
నిలిచాడు. పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ అభిషేక్ కూడా పరుగుల బాట పట్టాడు. ఇషాన్ కిషన్
సైతం బ్యాట్ ఝళిపించడంతో భారత్ కొండంత స్కోరు చేసింది. పరుగుల వరద పారడంలో కీలక
పాత్ర మాత్రం సంజు శాంసన్ దే. అభిషేక్ తో తొలి వికెట్ కు 98 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చిన అతడు.. ఇషాన్ కిషన్ తో 105 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టాస్ ఓడి టీమ్
ఇండియా బ్యాటింగ్ కు దిగగా.. అభిషేక్, శాంసన్
బ్యాట్లు ఝళిపించారు. హెన్రీ బౌలింగ్లో సిక్స్ తో శాంసన్ ఖాతా తెరవగా.. డఫీ ఓవర్లో
అభిషేక్ రెండు ఫోర్లు దంచేశాడు. ఇద్దరూ కళ్లు చెదిరే సిక్స్లు కొట్టారు. అభిషేక్
మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచేయడంతో ఓ ఓవర్లో డఫీ 20 పరుగులు సమర్పించుకున్నాడు. 18 బంతుల్లోనే అభిషేక్ అర్ధసెంచరీ చేయగా.. పవర్ ఆఖరికి భారత్ 92/0తో నిలిచింది.
తర్వాతి
ఓవర్లోనే అభిషేక్ ఔటైనా.. భారత్ ఇన్నింగ్స్ జోరు తగ్గలేదు. ఇషాన్ కిషన్ కూడా
ఎడాపెడా ఫోర్లు, సిక్స్లు బాదేశాడు. మరోవైపు సంజు 33 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. రచిన్ ఓవర్లో అతడు వరుసగా
6,
6, 6 బాదేశాడు. 15వ ఓవర్లో
భారత్ 203/1తో నిలవడంతో తేలికగా 270కిపై స్కోరు చేస్తుందని అనుకున్నారంతా! 300 పైకి కూడా ఆలోచనలు వెళ్లాయి. కానీ 16వ ఓవర్లో
ఒక్కసారిగా భారత్కు బ్రేక్ పడ్డట్లయింది. ఇన్నింగ్స్ స్వరూపం మారింది. నీషమ్ ఆ
ఓవర్లో శాంసన్, ఇషాన్, సూర్యలను ఔట్ చేసి భారత్కు షాకిచ్చాడు. 16-19 మధ్య 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే వచ్చాయి. హార్దిక్ (18) 19వ ఓవర్లో వెనుదిరిగాడు. అయితే ఆఖరి ఓవర్లో దూబె (26 నాటౌట్) లెక్క సరిచేశాడు. అతడు మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు బాదడంతో నీషమ్ 24 పరుగులు సమర్పించుకున్నాడు.
చుట్టేశారు:
ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. ఏ దశలోనూ పోటీలేదు. ఇటు స్పిన్ తో అక్షర్.. అటు పేస్
బుమ్రా ఆ జట్టును చుట్టేశారు.
===================
ప్లేయర్ ఆఫ్
ద టోర్నీ: శాంసన్ (5 ఇన్నింగ్స్ ల్లో 321 పరుగులు)
ప్లేయర్ ఆఫ్
ద మ్యాచ్: జస్ ప్రీత్ బుమ్రా (4/15)
అత్యధిక
వికెట్లు: బుమ్రా, వరుణ్ చక్రవర్తి (14, భారత్)
అత్యధిక సిక్సర్లు: సంజు శాంసన్ (24, భారత్)
అత్యధిక
జట్టు స్కోరు: భారత్ (256/4, జింబాబ్వేపై)
విజేత: 27.48 కోట్లు
రన్నరప్: 14.65 కోట్లు
సెమీ
ఫైనలిస్ట్: 7.23 కోట్లు
===================
రికార్డులు:
1. టీ20 ప్రపంచకప్ ఆతిధ్య జట్టు గెలవటం ఇదే మొదటి సారి.
2. వరుసగా రెండు
టీ20
ప్రపంచకప్ లు కూడా గెలిచింది మన జట్టే, అంటే ఢిఫెండింగ్ చాంపియన్
గా టైటిల్ ని నిలబెట్టుకుంది.
3. భారత్
గెలిచిన టీ20 ప్రపంచకప్ లు (2007,
2024,2026). ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిళ్లు (3)
నెగ్గింది టీమ్ ఇండియానే.
4. మొత్తం గా
టీ20
ప్రపంచకప్ లో 4 సార్లు ఫైనల్ కి వెళ్ళింది భారత్ జట్టు (2007,
2014, 2024, 2026)
5. భారత్
ఖాతాలో ఇది అయిదో ప్రపంచకప్. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ (1983, 2011), మూడుసార్లు టీ20 ప్రపంచకప్ (2007,
2024, 2026).
===================
===================





0 Komentar