Ola Electric Announces Akshaya Tritiya Festive
Benefits Up to Rs. 50,000 – Details Here
ఓలా
ఎలక్ట్రిక్: ‘అక్షయ తృతీయ’ పండుగ సందర్భంగా
'ఓలా సోనా వీకెండ్’ ఆఫర్ – వివరాలు ఇవే
==================
ఈ ఏడాది ‘అక్షయ
తృతీయ’ పండుగ సందర్భంగా ప్రముఖ విద్యుత్
వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా సోనా
వీకెండ్’ ను ప్రకటించింది. తమ పోర్ట్ఫోలియోలోని అన్ని వాహనాలపై రూ.50 వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. కొత్త వాహనాల
కొనుగోలుపై రూ.40 వేల వరకు ప్రయోజనాలతో పాటు బ్యాంకు
ఆఫ్ బరోడా, స్కాపియా ఫెడరల్, యస్ బ్యాంకు, ఐబీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ.10 వేల అదనపు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఆఫర్లు ఈ శని, ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఆఫర్ల వివరాలు:
> జెన్ 3 ఎస్1 ఎక్స్ X (2kWh), రోడ్లస్టర్ ఎక్స్ (2.5 kWh) విద్యుత్ వాహనాల ప్రారంభ ధర రూ.49,999 గా ప్రకటించింది.
> Roadster_X+ 9.1
kWh విద్యుత్ బైక్పై ఏకంగా రూ.50 వేల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ వాహనం రూ.1,39,999 కే పొందొచ్చు. అంతేకాకుండా ఈ ఆఫర్లలో కొనుగోలు చేసిన
వాహనాలకు 8 ఏళ్ల పాటు బ్యాటరీ వారెంటీని
అందిస్తామని ప్రకటించింది.
> ఈ రెండు
రోజుల్లో వాహనాలు కొనుగోలు చేసిన వారిలో లక్కీ డ్రా విజేతకు ఓలా సోనా స్పెషల్
ఎడిషన్ ను బహుమతిగా అందిస్తామని ప్రకటించింది.
> 4680 భారత్ సెల్ తో రూపొందించిన రోడ్జస్టర్ X+ 9.1 కొనుగోలు గడువును పొడిగించింది.
==================
OLA SONA WEEKEND
— Ola Electric (@OlaElectric) April 18, 2026
This Akshaya Tritiya, unlock golden offers.
Buy an Ola on April 18th–19th & stand a chance to win the exclusive Ola Sona, a real GOLD scooter* pic.twitter.com/6Sn0OpH3Ra



0 Komentar