LHMS AP Police – Mobile APP – ఈ యాప్ ఉపయోగం ఏంటి? యాప్ ఎలా వాడాలి? రిజిస్ట్రేషన్ ఎలా?
=====================
వేసవిలో ఎక్కువగా
యాత్రలు,
వివాహాలకు, మొక్కులు
తీర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటం
ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లకు LHMS యాప్
ద్వారా పోలీసులు భద్రత కల్పిస్తారు.
యాప్ ఎలా వాడాలి?
రిజిస్ట్రేషన్ ఎలా?
ప్లేస్టోర్
నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిలో ఫోను నంబరు, జిల్లా, పట్టణం పేరు, ఇంటి నంబరు, చిరునామా వంటి వివరాలు ఎంటర్ చేసి రిక్వెస్ట్ పోలీస్ వాచ్ ను
ఎంచుకొని.. ఊరు వెళ్లేది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు టైం అడుగుతుంది. ఆ వివరాలు
ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ ఓకే చేస్తుంది.
ఒక వేళ
మొబైల్లో రిజిస్టర్ చేసుకోవడం తెలియక పోతే మీ ఇంటికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను
ఆశ్రయిస్తే వారు మీ మొబైల్ ద్వారా రిజిస్టర్ చేస్తారు. అనంతరం పోలీసు సిబ్బంది మీ
ఇంటికి వచ్చి మీరు ఊరు వెళ్లే రోజున మీ సమక్షంలో ఇంట్లో LHMS డివైస్ అమర్చుతారు.
దొంగలు
ప్రవేశిస్తే కంట్రోల్ రూమ్ లో అలారం..
ఇంట్లో
డివైస్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు రోజుకు 3 సార్లు పోలీసులు మీ ఇంటిని తనిఖీ చేస్తారు. ఒకవేళ ఎవరైనా
తాళాలు పగలగొట్టి, లేదంటే తీసి లోపలికి
ప్రవేశించగానే కంట్రోల్ రూమ్ లో అలారం మోగుతుంది.
About this app
Locked House Monitoring System is an App designed by Andhra Pradesh Police Dept,with a Concept to Monitor the Locked Houses in Andhra Pradesh for prevention of possible burglaries & thefts.
=====================
=====================



0 Komentar