Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2026: Apply for 7,150 Apprentice Posts – Details Here

 

SBI Recruitment 2026: Apply for 7,150 Apprentice Posts – Details Here

ఎస్బీఐలో 7,150 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ. 15,000  

==================

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, ముంబయి.. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటిస్ల నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మే 19 నుంచి జూన్ 8 వరకు కొనసాగుతాయి.

పోస్టు వివరాలు & ఖాళీల సంఖ్య:

మొత్తం సీట్ల సంఖ్య: దేశవ్యాప్తంగా మొత్తం 7,150 సీట్లు.

ఆంధ్రప్రదేశ్: 709 సీట్లు (స్థానిక భాష: తెలుగు/ఉర్దూ).

తెలంగాణ: 491 సీట్లు (స్థానిక భాష: తెలుగు/ఉర్దూ).

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం రావాలి), ఎంపిక ప్రక్రియలో భాగంగా స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు.

ఉపకారవేతనం (స్టైపెండ్): నెలకు రూ. 15,000  

వయోపరిమితి: 01.04.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా అధికారిక ఎన్ఏపీఎస్ (NAPS) పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ (sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings) ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్లో వ్యక్తిగత, విద్యా వివరాలు నింపి, ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్లోడ్ చేసి, ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

==================

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 19.05.2026.

దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08.06.2026.

==================

NOTIFICATION

REGISTRATION

APPLY HERE

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags