Ather Konarc New Electric Scooter- Price & Features Details Here
ఏథర్ నూతన కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే
====================
ఏథర్ మరో
స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 'కోణార్క్' (Ather Konarc)
పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ S, Z అనే రెండు వేరియంట్స్ తో లభించనుంది. రూ.లక్ష ప్రారంభ ధరతో
వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఎస్ వేరియంట్లో మొత్తం నాలుగు మోడల్స్ను
తీసుకొచ్చింది.
2.1kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన S100 వేరియంట్ సింగిల్ ఛార్జ్ 100 కి.మీ. (IDC) వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే 2.7kWh, 3.5kWh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే వేరియంట్స్ వరుసగా 125 కి.మీ. (IDC), 161 కి.మీ. (IDC) రేంజ్ను ఇవ్వనున్నాయి. వీటి టాప్ స్పీడ్ 70kmph. కోణార్క్ 450w ఆర్బోర్డ్ ఛార్జర్తో
రానుంది. దీనిని 900w ఆఫ్ బోర్డ్
ఛార్జర్కు అనుసంధానించడం ద్వారా మొత్తం 1.35kW ఛార్జింగ్ సామర్థ్యాన్ని పొందవచ్చు.
ఇంటి వద్ద 0-80శాతం ఛార్జ్ చేయడానికి S100 వేరియంట్ కు 4 గంటల సమయం, S125
కు 4గంటలా 30 నిమిషాలు, S161కు5గంటలా 40 నిమిషాల సమయ
పడుతుందని కంపెనీ చెబుతోంది. అదే కంబైన్డ్ ఛార్జ్ సాయంతో ఈ సమయం సగానికి
తగ్గుతుందట. కేవలం 10 నిమిషాలు ఛార్జ్
చేయడం ద్వారా 13కి. మీ. వరకూ ప్రయాణింవచ్చని 13కి.మీ. ఏథర్ వెల్లడించింది. S వేరియంట్లో 200 కి.మీ రేంజ్ ఇచ్చే
మరో స్కూటర్ ను కూడా తీసుకురానున్నట్లు
ఏథర్ తెలిపింది.
ఫీచర్లు:
ఇక కోణార్క్ 31 లీటర్ల స్టోరీజ్ సామర్థ్యంతో రానుంది. 18w యూఎస్బీ టైప్-సిపోర్ట్, అండర్ సీట్
ల్యాంప్,
s100 వేరియంట్కు 4.2 అంగుళాల డిస్ప్లే మిగిలిన వాటికి 7 అంగుళాల
డిస్ప్లే ఇచ్చారు. పార్క్ అసిస్ట్ రివర్స్, ఆటోహోల్డ్
తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. కోణార్క్ జెడ్ వేరియంట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్
బ్రేకింగ్ సిస్టమ్ (AEBS)తో రానుంది. అలాగే
దీనికి మేజిక్ కీ ఇవ్వనున్నారు. స్కూటర్ లాక్, అన్లాక్ ను
యాప్ ద్వారా నియంత్రించవచ్చు. గూగుల్ మ్యాప్స్, వాట్సాప్లను
కూడా జెడ్ వేరియంట్లో ఉపయోగించుకోవచ్చు. థెఫ్ట్ అలర్ట్, రైడ్ స్టాటిస్టిక్స్, ఫైండ్ మై
స్కూటర్,
ఛార్జింగ్ పర్యవేక్షణ, ఓటీఏ
అప్డేట్స్ వంటి వాటికి జెడ్ వేరియంట్ సపోర్ట్ చేస్తుంది.
====================
====================




0 Komentar