Amazon 'Great Indian Festival’ Sale 2026
– Dates and Offer Details Here
అమెజాన్
‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2026 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
==================
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026' సేల్ తేదీని (Amazon Great Indian Festival 2026) ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్
ప్రారంభం కానుంది. మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా 'బిగ్ బిలియన్ డేస్ 2026' సేల్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అక్టోబర్ 9న రాబోతుంది.
గ్రేట్
ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఎసీబీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ తన
మైక్రోసైట్లో పేర్కొంది. ప్రైమ్ మెంబర్లకు 10 శాతం వరకు అదనపు ఆఫర్లు ఉంటాయని తెలిపింది. 8 పీఎం డీల్స్, బ్లాక్ బస్టర్
డీల్స్,
టాప్ 100 డీల్స్, మెగా డీల్స్ పేరుతో పలు రకాల ఆఫర్లను అందుబాటులోకి
తీసుకురానున్నట్లు వెల్లడించింది.
ఇందులో
గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, ఐఫోన్ 16, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ వంటి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అన్ని
బ్యాంకులు, కూపన్ ఆఫర్లతో కలుపుకోని డిస్కౌంట్లను
రివీల్ చేసింది. ఎంపిక చేసిన ఫోన్లపై ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. మరికొన్ని
స్మార్ట్ఫోన్ల ఆఫర్లను వెల్లడించాల్సి ఉంది.
> శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 5జీ ధర ప్రస్తుతం రూ.99,999గా ఉండగా.. ఆఫర్లో రూ.84,999 నుంచే ప్రారంభం కానుంది.
> ఐఫోన్
16 ధర రూ.89,900 కాగా.. డిస్కౌంట్ అనంతరం రూ.71,999కు లభిస్తోంది.
> గెలాక్సీ
ఏ56 5జీ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.31,999గా నిర్ణయించింది.
> వన్ ప్లస్
నార్డ్ సీఈ6 ధర రూ. 40,999 కాగా.. ఆఫర్లో రూ.33,999కు లభిస్తుంది. ఆరు నెలల ఈఏంఐ
సదుపాయం ఉంది.
> ఐకూ
జెడ్11 ఎక్స్డ్ ధర రూ.40,999 ఉండగా.. పండగ డీల్స్ లో రూ.24,999కు లభిస్తుంది.
> రెడ్ 15
సీ 5జీ ప్రైమ్ ధర రూ.29,999 కాగా డిస్కౌంట్ అనంతరం రూ.15,999కు లభిస్తుంది.
> గెలాక్సీ
ఎం17ఈ 5జీ ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది.
> వన్ప్లస్
నార్డ్ 6 ధర రూ.52,999 ఉండగా.. డిస్కౌంట్ రూ.42,999కు కొనుగోలు చేయొచ్చు.
> ఐకూ 15
ఆర్ ధర రూ.69,999 కాగా.. ఆఫర్లో రూ.46,499కు లభిస్తుంది.
> షావోమీ
17 ధర రూ. 1,19,999 ఉండగా.. ఆఫర్లో రూ.59,999కు కొనుగోలు చేయొచ్చు. దాదాపు 50 శాతం
మేర డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
==================
==================



0 Komentar