Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS-EdCET Result-2020 Released

 


 TS-EdCET Result-2020 Released 

టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల 

తెలంగాణ ఎడ్‌సెట్-2020 ఫలితాలను విడుదల చేశారు . భారీ వర్షాల కారణంగా ఈ నెల 21న ప్రకటించాల్సిన ఫలితాలను.. 28వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీఈడీ కాలేజీల్లో 20వేల సీట్లు ఉండగా.. 30వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షను అక్టోబర్‌ 1, 3వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష అభ్యర్థులు https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 

ఎడ్‌సెట్‌లో ర్యాంకు ద్వారా రెండేళ్ల కాలవ్యవధి కలిగిన బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో టీచర్ పోస్టుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. టీఎస్ ఎడ్‌సెట్ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్). 2020 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని బీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది.

WEBSITE


Previous
Next Post »
0 Komentar

Google Tags