Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC Exam Results Out - School Assistant, Assistant Professor posts

TSPSC Exam Results Out - School Assistant, Assistant Professor posts

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పరీక్ష ఫలితాలు వెల్లడి - స్కూల్ అసిస్టెంట్, సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (హిందీ), వైద్యవిద్య డైరెక్టరేట్లో సహాయ ప్రొఫెసర్ (క్లినికల్) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను టి‌ఎస్‌పి‌ఎస్‌సి గురువారం విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్ (హిందీ) కేటగిరీలో 158 సహాయ ప్రొఫెసర్(క్లినికల్) కేటగిరీలో 167 పోస్టులు కలిపి మొత్తం 325 పోస్టుల భర్తీకి కమిషన్ ప్రకటన జారీ చేసి పరీక్షలను నిర్వహించింది. ఆ ఫలితాల వివరాలను టి‌ఎస్‌పి‌ఎస్‌సి ప్రకటించింది. పాఠశాలల్లో 158 స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుల కోసం రాతపరీక్ష నిర్వహించి 148 పోస్టులను భర్తీ చేశాం. సరైన అభ్యర్థులు లేక 3 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. కోర్టు కేసులతో 2 పోస్టుల ఫలితాలు ఇవ్వలేదు. దివ్యాంగ కేటగిరీలోని ఐదు పోస్టుల ఫలితాలను వైద్యపరీక్షల నివేదికల తరువాత ప్రకటిస్తాం అని టీఎస్పీఎస్సీ తెలిపింది. సహాయ ప్రొఫెసర్ (క్లినికల్) కేటగిరీలో 167 పోస్టులకుగాను 107 భర్తీ అయ్యాయని వివరించింది. 59 పోస్టులు మిగిలిపోయాయని, మరో పోస్టు ఫలితాన్ని తరవాత ప్రకటిస్తామని పేర్కొంది.

School Assistant Posts

School Assistant Posts Selection

Assistant Professor Posts

Assistant Professor Posts Selection

Previous
Next Post »
0 Komentar

Google Tags