Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Army Recruitment Rally from January 4

 

Army Recruitment Rally from January 4

జనవరి 4 నుంచి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

యూనిట్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోటా కింద 1 ఈఎంఈ సెంటర్‌లో జనవరి 4 నుంచి ఫిబ్రవరి 28 వరకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ, పౌర సంబంధాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధ వితంతువుల కుమారులు, వీర మరణం పొందిన సైనికుల భార్యలు, కుటుంబ సభ్యులు, ప్రస్తుత సైనికుల తమ్ముళ్లు, టెరిటోరియల్‌ ఆర్మీకి చెందిన మాజీ సైనికోద్యోగుల కుమారులు అర్హులని పేర్కొన్నారు. సోల్జర్‌ టెక్నికల్‌(ఏవియేషన్‌), సోల్జర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్‌మెన్‌, చెఫ్‌, స్టీవార్డ్‌ పోస్టులకు పదో తరగతి చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. వీటితోపాటు ఓపెన్‌ క్యాటగిరీలో కయాకింగ్‌, కనోయింగ్‌, రోయింగ్‌, అక్వాటిక్స్‌(స్విమ్మింగ్‌, డైవింగ్‌), వాలీబాల్‌ క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు జనవరి 4న ఉదయం 6 గంటలలోపు బొల్లారంలోని 1 ఈఎంఈ సెంటర్‌లోని 4వ ట్రైనింగ్‌ బెటాలియన్‌ వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags