Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా సీట్ల కేటాయింపు

 

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా సీట్ల కేటాయింపు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా విద్యారులకు కేటాయించారు. 11 విశ్వవిద్యాలయాల పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర కోర్సుల్లో కలిపి 4,96,055 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,95,700 సీట్లు కేటాయించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన విద్యారులు సంబంధిత కళాశాలల్లో జనవరి 27లోగా నేరుగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా రిపోర్టు చేయాలి. వీరికి మలివిడత కౌన్సెలింగ్‌లో సీట్ల కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఈ రెండు విధానాల్లో రిపోర్టు చేయకుంటే కేటాయించిన సీట్లు రద్దవుతాయని ఏపీ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar