Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp updates terms of service and privacy policy: Why you need to accept it

 

WhatsApp updates terms of service and privacy policy: Why you need to accept it

వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ.. ఓకే చెప్పారా?

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీని తాజాగా అప్‌డేట్‌ చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ తన యూజర్లకు ఓ నోటిఫికేషన్‌ పంపిస్తోంది. చాలామంది నిన్న సాయంత్రం నుంచి వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే ఈ నోటిఫికేషన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తోంది. వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసిన పాలసీకి అంగీకరించాలన్నది దాని సారాంశం. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటుంది. 

ఫిబ్రవరి 8 నుంచి ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి రానుంది. అప్పటిలోగా కొత్త పాలసీకి యూజర్‌ ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రైవసీ పాలసీని విస్మరించడానికి వీల్లేదు. ఎందుకంటే పాలసీని యూజర్‌ ఆమోదించకుంటే ఇకపై వాట్సాప్‌ను వినియోగించలేరు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు వాట్సాప్‌ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు పంపిస్తోంది. దిగువ చిత్రంలో చూపిన విధంగా మీ వాట్సాప్‌ తెరపై వచ్చిన సందేశానికి మీరు ‘అగ్రీ’ బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. డేటా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేయడం గమనార్హం.


Previous
Next Post »
0 Komentar