Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Encourage Students to Take Online Exam On "Cow Science": UGC To Universities

 

Encourage Students to Take Online Exam On "Cow Science": UGC To Universities

ఆవుపై ఆన్‌లైన్‌ పరీక్ష - విస్తృత ప్రచారం కల్పించండంటూ ఉప కులపతులకు యూజీసీ లేఖ

రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ఈనెల 25న ఆవుపై దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తోందని, దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) లేఖ రాసింది. ఈ పరీక్ష జరుగుతుందన్న సమాచారాన్ని అనుబంధ కళాశాలలకూ తెలపాలని అందులో యూజీసీ సూచించింది.

‘‘మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 2019లో ఏర్పడిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌(ఆర్‌కేఏ) గురించి మీకు తెలుసు. ఈ సంస్థ దేశీయ ఆవుల ఆర్థిక, శాస్త్రీయ, పర్యావరణ, వ్యవసాయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కృషిచేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 25న ‘కామధేను గౌ విజ్ఞాన్‌ ప్రచార్‌-ప్రసార్‌ పరీక్ష’ నిర్వహిస్తోంది. ఇందులో ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్‌ మాధ్యమిక పాఠశాలలతో పాటు కళాశాలల, విశ్వవిద్యాలయ విద్యార్థులు, సాధారణ ప్రజానీకమూ పాల్గొనవచ్చు. ఈ పరీక్షను వీలైనంత ఎక్కువ మంది రాసేలా ప్రోత్సహించండి’’ అని యూజీసీ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ లేఖలో పేర్కొన్నారు. ఇంగ్లిష్‌తో పాటు ఈ పరీక్ష 11 ప్రాంతీయ భాషల్లో జరగనుంది.

Previous
Next Post »

1 comment

Google Tags