Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఏప్రిల్‌ 27నుంచి నుంచి పాఠశాలలకు సెలవులు - ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

 

TS: ఏప్రిల్‌ 27నుంచి నుంచి పాఠశాలలకు సెలవులు - ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలోని పాఠశాలు, జూనియర్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్‌, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్‌ చేసినట్లు గుర్తు చేశారు.

1 నుంచి 9 తరగతులకు చెందిన 53.79లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తెరిచే విషయంపై జూన్‌ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఏప్రిల్‌ 26ను ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని సబిత చెప్పారు.

Previous
Next Post »
0 Komentar